కృష్ణ ముకుంద మురారి ఆగస్ట్ 12 ఎపిసోడ్: కృష్ణ మనసులోని మాట మురారికి చెప్తుందా?

by Prasanna |   ( Updated:2023-08-12 13:59:46.0  )
కృష్ణ ముకుంద మురారి ఆగస్ట్ 12 ఎపిసోడ్: కృష్ణ మనసులోని మాట మురారికి చెప్తుందా?
X

దిశ, వెబ్ డెస్క్: నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ఈ సీను హైలెట్

మురారీ, కృష్ణలు ఒకరి ప్రేమను ఒకరు ఎలా చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే.. అదే అవకాశం అనుకుని ముకుంద కొత్త ప్లాన్ రెడీ చేసుకుంటుంది. ఇక కృష్ణ మెడికల్ క్యాంప్‌ నుంచి తన ఊరు వెళ్లిపోతుందని క్లారిటీ వచ్చేసింది.. ఆ విషయం తెలుసుకున్న ముకుంద చాలా సంతోషంగా ఉంటుంది. మరోవైపు నందు ఎదో ఆలోచిస్తూ ఉంటే.. నిజం చెప్పమని అడుగుతుంది. ఇక చేసేదేమి లేక నందు నిజం చెబుతుంది. ‘నీ దగ్గర నాకు ఏ రహస్యాలుంటాయి.. కృష్ణ, మురారీ విడిపోబోతున్నారు. వాళ్లది నిజమైన పెళ్లి కాదు. అగ్రిమెంట్ మ్యారేజ్.కానీ మురారీ అన్నయ్యకి కృష్ణ అంటే చాలా ఇష్టం.. ఆ విషయం నాకు చెప్పాడు ఇంకా కృష్ణకి చెప్పలేదు. చెబితే తనను ఆపినట్లు ఉంటుందని తనలో తాను చాలా బాధపడుతున్నాడు. పోనీ నేను వెళ్లి చెబుదామంటే.. నన్ను చెప్పొద్దని ఒట్టు పెట్టుకున్నాడు.. అందుకే నేనేమి చెప్పలేకపోతున్నాను.. ఏం చెయ్యాలో ఏమి అర్థం కావట్లేదు..’ అంటూ తన మనసులోని మాట గౌతమ్‌కి చెబుతుంది నందు.

Advertisement

Next Story

Most Viewed