ఎన్‌టీఆర్, కొరటాల కాంబో.. రీవెంజ్ తీర్చుకునేందుకు రెడీ..

by Disha News Desk |
ఎన్‌టీఆర్, కొరటాల కాంబో.. రీవెంజ్ తీర్చుకునేందుకు రెడీ..
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబో మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరి కాంబోపై తారాస్థాయి అంచనాలు పెట్టుకున్నారు. వీరి మూవీ మరో జనతా గ్యారేజ్ తరహాలో అందరినీ ఆకట్టుకుంటుందని, లేకుంటే అంతకుమించి అనేలా కొరటాల రెడీ చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ ఈ కాంబో గురించి అదిరిపోయే న్యూస్ వచ్చింది. ఎన్‌టీఆర్, కొరటాల కాంబో మూవీ పట్టాలెక్కేందుకు సిద్ధం అవుతోందని, మూవీ స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్‌ను కొరటాల రెడీ చేస్తున్నాడట.

ఈ సినిమా రివేంజ్ డ్రామాగా తెరకెక్కనుందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. సిరీ సర్కిల్స్‌లో సైతం వీరి కాంబో గురించే చర్చలు జరుగుతున్నాయి. నెవ్వర్ బిఫోర్ అనేలా ఎన్‌టీఆర్‌ను చూపాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా చిత్రీకరణ గురించి త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుందని టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై ఎన్‌టీఆర్, కొరటాల ఎవరైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.



Advertisement

Next Story