KONIDELA NIHARIKA: సిద్ధుకు థాంక్స్ చెప్పిన నిహారిక.. అనుకునే వాళ్లు అనుకుంటూనే ఉంటారంటూ షాకింగ్ కామెంట్స్

by Anjali |
KONIDELA NIHARIKA: సిద్ధుకు థాంక్స్ చెప్పిన నిహారిక.. అనుకునే వాళ్లు అనుకుంటూనే ఉంటారంటూ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: నేడు యదు వంశీ దర్శకత్వం వహిస్తూన్న ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్ర ట్రైలర్ రిలీజై భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. నిహారిక కొణిదెల నిహారిక నిర్మిస్తోన్న మొదటి సినిమా కావడం విశేషం. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతోన్నఈ చిత్ర ట్రైలర్ ఈవెంట్‌కు డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ గెస్ట్‌గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా సిద్దు జొన్నలగడ్డ సినిమా హిట్ కావాలని మాట్లాడారు. అనంతరం నిహారిక కొణిదెల మాట్లాడుతూ..

ముందుగా సిద్ధుకు థాంక్యూ అని చెప్పుకొచ్చింది. ఆయనకు షూటింగ్ ఉన్నా కూడా పిలవగానే వచ్చారని తెలిపింది. ఈ సినిమా కోసం కుర్రాళ్లు మూడేళ్లుగా వర్క్ చేస్తూనే ఉన్నారని పేర్కొంది. అంతా తమ తమ పాత్రలకు ప్రాణం పోశారని వెల్లడించింది. ఆగస్ట్ 9న రాబోయే కమిటీ కుర్రాళ్లీ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుందని తెలిపింది. అందరూ వీక్షించి సక్సెస్ చేయండని.. బాగుందని, బాలేదని అనుకున్నవాళ్లు అనుకుంటూనే ఉంటారు ఇక అంటూ మెగా డాటర్ మాట్లాడింది. కానీ నిహారిక ఏకంగా ఏకంగా పదకొండు మంది హీరోలు, నలుగురు కథానాయికలతో మూవీ తీయడమంటే మామూలు విషయం కాదంటూ మెగా డాటర్‌ను నెట్టింట నెటజన్లు కొనియాడుతున్నారు.

Advertisement

Next Story