- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Young Hero : అయ్యో పాపం.. కేరళలో వరదలు.. యంగ్ హీరోకి పెళ్లి కష్టాలు
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక్కో సినిమాతో తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటూ స్టార్ ఇమేజ్‌ను అందుకుంటున్నాడు. అలా రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే, వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్ అంటూ పలు సినిమాలు చేసి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం దిల్ రూబా, కా వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు.
ఇదిలా ఉంటే రాజావారు రాణివారు సినిమాతో పరిచయమైన హీరోయిన్ రహస్య గోరఖ్‌ను కిరణ్ అబ్బవరం ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడనే విషయం తెలిసిందే. వీరిద్దరి ఎంగేజ్మెంట్‌కు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా వీరిద్దరూ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రావణం మాసం కాబట్టి మంచి ముహూర్తాలు ఉన్నాయి. అందులో భాగంగా ఆగస్టు 22న వీరు తమ పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది.
అయితే రహస్య గోరఖ్, కిరణ్ అబ్బవరంలు కేరళలో గ్రాండ్‌గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని అనుకున్నారట. కానీ, ప్రస్తుతం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వరదలతో పరిస్థితులు బాగోలేవు అన్న విషయం తెలిసిందే. అసలు అక్కడ జనాలు జీవించడానికి వీలు లేకుండా ఉంది. అందుకే అనుకున్న డేట‌్‌కే పెళ్లి జరగాలని అనుకోవడంతో పెళ్లి జరిగే ప్రాంతం మారినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం, రహస్య పెళ్లి ఆగస్టు 22న కర్ణాటకలోని కూర్గ్ అనే ప్రాంతంలో జరగనుందట. ఇక అదే రోజున మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కూడా కావడంతో తమ పెళ్లి రోజు గుర్తిండి పోవాలని హీరో అలా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతుంది.