- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kiara: బాలీవుడ్ అగ్ర హీరోతో కియారా స్పెషల్ సాంగ్.. నాటునాటు తరహాలో తారక్-హృతిక్ స్టెప్పులు
దిశ, వెబ్‌డెస్క్: ఫగ్లీ అనే హిందీ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కియారా అద్వానీ. తర్వాత తన టాలెంట్‌తో ఎం.ఎస్.ధోని, మెషీన్, భరత్ అనే నేను, లస్ట్ స్టొరీస్, వినయ విధేయ రామ, కళంక్, కబీర్ సింగ్, గుడ్ న్యూస్, భూల్ భులయా 2, జగ్ జగ్ జీయో, గోవిందా నామ్ మేరా వంటి సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం మెగా హీరో రామ్ చరణ్ సరసన ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. డిసెంబరు నెల చివర్లో విడుదల కానుంది. ఈ ఏడాది కియారా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. గత ఏడాది కేవలం సత్యప్రేమ్ కీ కథా అనే సినిమాతో సరిపెట్టుకుంది. పెద్దగా అవకాశాలు రాలేదు.
ప్రస్తుతం ఈ బ్యూటీ జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కీలక పాత్రల్లో నటిస్తోన్న వార్-2 లో కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఇందులో కియారా, హృతిక్‌పై ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారట. పైగా లవ్ సాంగ్. ఈ పాటకు సంబంధించిన షూటింగ్ సెప్టెంబరు 18 వ తేదీన ఇటలీలో జరగనుందని సమాచారం. అలాగే తారక్, హృతిక్ తో ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ డాన్స్ తరహాలో ఓ సాంగ్ చేయబోతున్నారట. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది.
- Tags
- Kiara Advani