ఆ హిట్ సినిమా రీమేక్‌లో శ్రీదేవి కూతురు..!

by sudharani |   ( Updated:2024-03-15 13:27:26.0  )
ఆ హిట్ సినిమా రీమేక్‌లో శ్రీదేవి కూతురు..!
X

దిశ, సినిమా: అందాల తారా, దివాంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2023లో ‘ది ఆర్కైస్’ అనే చిత్రంతో వెండితెరకి పరిచమైన ఈమె.. అక్క జాన్వీ కపూర్ అంతా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ ఎప్పుటికప్పుడూ తన అందాలతో అభిమానులను ఆకట్టుకుటోంది. ప్రస్తుతం జాన్వీ అందాల దోస్ పెంచడంతో సినిమా ఆఫర్లు కూడా గట్టిగానే వస్తున్నట్లు టాక్. ఈ క్రమంలోనే ఆమె చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నట్లు టాక్. అందులో తమిళంలో సూపర్ హిట్ అందుకున్న ‘లవ్ టుడే’ చిత్రం ఒకటని సమాచారం.

ప్రదీన్ రంగనాథన్ హీరోగా స్వీయా దర్శక్తవంలో వచ్చిన సినిమా ‘లవ్ టుడే’. ఇవాన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్‌మెంట్ పతాకంపై కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ సంయుక్తంగా కలిసి నిర్మించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడే ఇదే మూవీని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరో కాగా.. హీరోయిన్‌గా అందాల తారా శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ నటిస్తున్నట్లు టాక్. కాగా.. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Read More..

కుల్ఫీతో అనసూయ.. ఆ ప్లేస్‌లో వేరేదాన్ని ఊహించుకుంటూ డర్టీ కామెంట్స్ చేస్తోన్న పోరగాళ్లు

Advertisement

Next Story