ఆ నటుడితో ప్రేమలో ఉన్న కార్తీక దీపం మోనిత.. అతను ఎవరంటే?

by Prasanna |   ( Updated:2023-06-27 04:56:33.0  )
ఆ నటుడితో ప్రేమలో ఉన్న కార్తీక దీపం మోనిత.. అతను ఎవరంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : కార్తీకదీపం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మోనిత పాత్రతో పరిచయమైన శోభశెట్టి. ఆ సీరియల్లో విలన్ పాత్రలో నటించి మంచి మార్కులు వేపించుకుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.ఆ ఛానల్లో తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటుంది. కార్తీక దీపం సెట్లో చాలా వీడియోలను అప్లోడ్ చేసింది. అయితే ఇదంతా పక్కన పెడితే తనతో కలిసి కార్తీకదీపం సీరియల్లో నటించిన నటుడు యశ్వంత్ అందరికీ తెలుసు. కార్తీకదీపం సీరియల్లో కార్తీక్ తమ్ముడు పాత్రలో నటించాడు.

తాజాగా ఈ ముద్దుగుమ్మ స్టోరీని గమనిస్తే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని జనాలు అనుకుంటున్నారు. ఆ స్టోరీలో అతడికి బర్త్డే విషెస్ చేస్తూ "నా లైఫ్ లోకి సంతోషాన్ని తీసుకొచ్చినందుకు నీకు చాలా థాంక్స్.. నా జీవితంలో నువ్వు ముఖ్యమైన పర్సన్" అంటూ రాసుకొచ్చింది. దీన్ని చుసిన నెటిజెన్స్ వీరిద్దరూ లవ్ లో ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed