- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంట్లో పని మనుషులకు సమాన గౌరవంపై స్పందించిన కరీన.. పిల్లల చైతన్యమేనంటూ
దిశ, సినిమా: ఇంట్లో పనిమనుషులు, పిల్లల కేర్ టేకర్స్‌తో తాము అనుసరించే విధానంపై ఓపెన్ అయింది నటి కరీన కపూర్ ఖాన్. రాబోయే తన సస్పెన్స్ థ్రిల్లర్ ‘జానే జాన్’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ఆమె.. తన పిల్లలు తైమూర్, జెహ్‌లు చిన్న వయసులోనే చైతన్యంగా ఆలోచించడం చూసి ఆశ్చర్యపోయానని చెప్పింది. ‘ఇంట్లో ఉన్నపుడు మేమంతా ఒకే డైనింగ్ టేబుల్‌పై భోజనం చేస్తాం. అయితే పిల్లలను చూసుకునే నానీలు మాకు దూరంగా కూర్చొని తినడం చూసి.. ‘నానీలు మనకు దూరంగా ప్రత్యేక టేబుల్‌పై ఎందుకు కూర్చుంటారు.
మనం భోజనం చేసేదాకా వాళ్లు ఆకలితో ఎందుకుండాలి’ అని పిల్లలు నన్ను ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా జెహ్ వారిని తమతో కలిసి కూర్చోమని డైరెక్ట్ పిలిచాడు. ఆ రోజుతో మా ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వాళ్లపై నిబంధనలన్నీ తొలిగిపోయాయి. మాతో సమానమైన గౌరవం పొందుతున్నారు. మా కుటుంబ ప్రయాణంలో ఎప్పుడూ కలిసి ఉంటారు. నా పిల్లలను వారి బిడ్డల్లాగే చూసుకుంటారు. నిజంగా అంత జాగ్రత్తగా నేను కూడా చూసుకోలేను అనిపిస్తుంది’ అంటూ ఎమోషనల్ అయింది కరీన.
- Tags
- Kareena kapoor