- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వాళ్లిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడానికి నేనే కారణం.. కరీనా కపూర్ కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ఇద్దరు పిల్లలకు తల్లైనా మంచి ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తూ.. యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించిన ఈ అమ్మడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని రణ్‌వీర్, దీపిక ప్రేమకు నేనే కారణమంటూ చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘మనకు ఏదైతే రాసిపెట్టి ఉంటుందో కచ్చితంగా అది జరిగి తీరుతుందనే విషయాన్ని నేను బాగా నమ్ముతాను. ‘రామ్ లీలా’ సినిమాలో హీరోయిన్‌గా ఫస్ట్ నాకే అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల చేత నేను ఆ సినిమా చెయ్యలేదు. ఈ అవకాశం దీపిక దగ్గరకు వెళ్లింది. అలా రణ్‌వీర్‌తో కలిసి నటించింది. తర్వాత వాళ్ల ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే వీరి ప్రేమ పెళ్లికి నేనే కారణం’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే సైఫ్ అలీఖాన్‌తో తన ప్రేమ విషయం మాట్లాడుతూ.. సైఫ్ చేసిన ‘కల్ హో నా హో’ సినిమా మొదట హీరోయిన్‌గా అవకాశమొచ్చిన చెయ్యలేదు. ఒకవేళ అప్పుడు ఆ ప్రాజెక్ట్ ఒకే చెప్పుంటే తనతో రిలేషన్ ఎప్పుడో స్టార్ అయ్యేది అంటూ తెలిపింది కరీనా కపూర్.