'కళ్యాణం కమనీయం' సరికొత్త అనుభూతినిస్తుంది: సంతోష్ శోభన్

by Hajipasha |   ( Updated:2023-01-10 13:58:45.0  )
కళ్యాణం కమనీయం సరికొత్త అనుభూతినిస్తుంది: సంతోష్ శోభన్
X

దిశ, సినిమా: యంగ్ హీరో సంతోష్ శోభన్, ప్రియా భవానీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'కళ్యాణం కమనీయం'. యూవీ కాన్సెప్ట్స్ నిర్మాణంలో దర్శకుడు అనిల్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 14న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలతో పాటు తన అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు సంతోష్. 'సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలనేది నా కల. ఈ చిత్రంతో ఆ కోరిక తీరుతోంది. చిరు, బాలయ్య చిత్రాలతో పాటు నా మూవీ రిలీజ్ కావడం మరింత స్పెషల్. ఇది మనందరికీ కనెక్ట్ అయ్యే కథ. ఇలాంటి స్టోరీలు అరుదుగా వస్తుంటాయి. రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలా ఉండదు. ఒక కొత్త ఎక్స్‌పిరియన్స్‌ ఇస్తుంది. ప్రభాస్ అన్న మా సినిమా పాట రిలీజ్ చేసే అదృష్టం దక్కినందుకు ఆనందంగా ఉంది. ఇక కథల ఎంపికలో తుది నిర్ణయం నాదే. సక్సెస్, ఫెయిల్యూర్స్ క్రెడిట్ మొత్తం నేనే తీసుకుంటా. అప్పుడే మనశ్శాంతిగా ఉంటుంది' అంటూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Advertisement

Next Story