ఆగని కల్కి రికార్డుల జోరు.. రూ. 1100 కోట్లకు చేరిన బాక్సాఫీస్ కలెక్షన్స్

by sudharani |
ఆగని కల్కి రికార్డుల జోరు.. రూ. 1100 కోట్లకు చేరిన బాక్సాఫీస్ కలెక్షన్స్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ చిత్రం రికార్డుల కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. మైథాలిజికల్, సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే 1000 కోట్లకు పైగా రాబట్టిన ఈ మూవీ ఎన్నో రికార్డులు నెలకొల్పింది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

అంతే కాకుండా విడుదలై 5 వారాలు గడుస్తున్నప్పటికీ ఇంకా కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఘనత సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వైజయంతి మూవీస్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ‘#Kalki2898AD 5వ వారంలో తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తోంది! తాజాగా రూ. 1100 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇంకా లెక్కింపు దశలోనే ఉంది’ అంటూ పోస్ట్ పెట్టారు. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.



Next Story