హోటల్‌లో కిస్ సీన్లు రిహార్సల్స్‌ చేసిన కాజోల్.. ఒకేసారి ఇద్దరికి మత్తెక్కించిందట

by Nagaya |   ( Updated:2023-07-15 15:38:28.0  )
హోటల్‌లో కిస్ సీన్లు రిహార్సల్స్‌ చేసిన కాజోల్.. ఒకేసారి ఇద్దరికి మత్తెక్కించిందట
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి కాజోల్ పలు వెబ్ సిరీస్‌ల కోసం 31 ఏళ్లుగా పాటిస్తున్న నో కిస్సింగ్ పాలసీని వదులుకోగా.. ఐదు పదుల వయసులోనూ లిప్ లాక్ సీన్స్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. ఇటీవలే ‘లస్ట్ స్టోరీస్ 2’ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నటి.. తాజాగా వచ్చిన ‘ది ట్రయల్’ వెబ్ సిరీస్‌లోనూ ఏకంగా ఇద్దరితో ముద్దు సీన్లు చేసి ఆశ్చర్యపరిచింది. కాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ గురించి పలు విషయాలు పంచుకున్న నటుడు అలీ ఖాన్.. రిహార్సల్ చేసి మరీ కాజోల్ ముద్దు సీన్లలో నటించినట్లు తెలిపాడు. ‘ఈ కిస్సింగ్ సీన్లను ఓ హోటల్‌లో చిత్రీకరించాం. ఈ సీన్ షూట్ కోసం దర్శకుడు క్లోజ్డ్ సెట్ ఏర్పాటు చేశాడు. ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే లోపల ఉన్నారు. దీంతో మాకు సిగ్గు, ఇబ్బంది, సంకోచం కలగలేదు. ఈ సన్నివేశాన్ని రెండుసార్లు రిహార్సల్ చేసి టేక్ కోసం వెళ్లాం. ఆ రిహార్సల్స్‌ను మానిటర్‌‌లో చూసి ఓకే అనుకున్నాకే టేక్ చేశారు’ అని వివరించాడు.

Advertisement

Next Story