ఈ గడ్డం నా జీవితాన్నే మార్చేసింది.. ఇటాలియన్ సినిమాల్లో చాన్స్ కొట్టేశా..

by Prasanna |   ( Updated:2023-05-27 07:18:48.0  )
ఈ గడ్డం నా జీవితాన్నే మార్చేసింది..  ఇటాలియన్ సినిమాల్లో చాన్స్ కొట్టేశా..
X

దిశ, సినిమా: ఇటాలియన్ సినిమాల్లో తనకు అవకాశాలు రావడంపై సీనియర్ నటుడు కబీర్ బేడీ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తాజాగా కపిల్ శర్మ షోలో పాల్గొన్న ఆయన కెరీర్ అనుభవాలను షేర్ చేసుకుంటూ అభిమానులను అలరించాడు. ఈ క్రమంలోనే తన గడ్డం ప్రత్యేకత గురించి ప్రశ్నించగా ఫన్నీ స్టోరీ చెప్పాడు. ‘ఓ సారి భారతదేశంలో పర్యటిస్తున్న ఇటలీకి చెందిన నిర్మాతల బృందం.. గడ్డం ఉన్న నటుడి కోసం వెతుకుతోంది. ఆ సమయంలోనే నేను వాళ్ల కంట పడ్డాను. నా స్టైలిష్ గడ్డం చూసి వాళ్లు అట్రాక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆడిషన్‌కు పిలవడం.. నేను వెళ్లడం.. చివరికి ఓ ముఖ్య పాత్ర చాన్స్ కొట్టేయడం జరిగింది. ఈ అనూహ్య పరిణామం నా జీవితంలో సానుకూల మార్పులు తెచ్చింది. నా గడ్డానికి ధన్యవాదాలు’ అంటూ సరదాగా పలు విషయాలు చెప్పుకొచ్చాడు.

Read More... విడాకులు తీసుకోబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో.. ట్వీట్ వైరల్

చీప్ టీఆర్‌పీ.. మీడియా తీరుపై నవాజుద్దీన్ ఫైర్

Advertisement

Next Story