ట్రైలర్ విడుదల చేసిన Jr. ఎన్టీఆర్.. ‘జాతిరత్నం ఎంట్రీ హైలైట్ (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-10-03 12:26:16.0  )
ట్రైలర్ విడుదల చేసిన Jr. ఎన్టీఆర్.. ‘జాతిరత్నం ఎంట్రీ హైలైట్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మ్యాడ్ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయం అవుతున్నారు. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ అక్టోబ‌ర్ 6న రిలీజ్ కానుంది. మ్యాడ్ మూవీ ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ రిలీజ్ చేశాడు. ఫ‌న్‌, పంచ్ డైలాగ్స్‌తో ట్రైల‌ర్ ఆద్యంతం ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగింది. ఇంజినీరింగ్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో ముగ్గురు స్నేహితుల చుట్టూ ఈ క‌థ సాగిన‌ట్లుగా క‌నిపిస్తుంది. కాలేజీ స్టూడెంట్స్ మ‌ధ్య ఉండే గొడ‌వ‌లు, స‌ర‌దాలు, ల‌వ్ స్టోరీస్‌తో డైరెక్టర్ క‌ళ్యాణ్ శంక‌ర్ మ్యాడ్ మూవీని తెర‌కెక్కించాడు.

అయితే, అనూహ్యంగా ఈ ట్రైల‌ర్‌లో జాతి రత్నాలు డైరెక్టర్‌ అనుదీప్ ఎంట్రీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమాలో అత‌డు గెస్ట్ రోల్ చేసిన‌ట్లు స‌మాచారం. శ్రీ గౌరిప్రియారెడ్డి, అనంతిక‌, గోపికా ఉద్యాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై హారిక సూర్యదేవ‌ర‌, సాయిసౌజ‌న్య నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నాడు.

Advertisement

Next Story