'జింతాక్..జింతాక్'.. రవితేజను డామినేట్ చేసిన యంగ్ బ్యూటీ..

by sudharani |   ( Updated:2023-10-14 15:03:13.0  )
జింతాక్..జింతాక్.. రవితేజను డామినేట్ చేసిన యంగ్ బ్యూటీ..
X

దిశ,సినిమా: త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'ధమాకా'. గ‌త నెల‌లో విడుద‌లైన రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రం దారుణంగా నిరాశ‌ప‌రిచినా.. ఈ సినిమాతో అభిమానుల్లో సరికొత్త జోష్ నింపేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే గురువారం ఈ చిత్రం నుంచి 'జింతాక్..' లిరికల్ సాంగ్ విడుదల కాగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల డ్యాన్స్‌తో అదరగొట్టేసింది అంటున్నారు నెటిజన్స్. దాదాపు రవితేజను డామినేట్ చేసినట్లు కనిపించిందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటను మంగ్లీ, భీమ్స్ ఆలపించగా.. ప్రస్తుతం మూవీ షూటింగ్ తుదిద‌శ‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది.


Advertisement

Next Story