Janhvi Kapoor: ఆయనకు ఒక్క సెకను చాలు.. నాకు 10 డేస్ పడుతుంది.. జాన్వీ కపూర్ కామెంట్స్ వైరల్

by sudharani |
Janhvi Kapoor: ఆయనకు ఒక్క సెకను చాలు.. నాకు 10 డేస్ పడుతుంది.. జాన్వీ కపూర్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగులో ‘దేవర’, ‘RC16’ రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలసిందే. వాటిలో ‘దేవర’ మూవీ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఇది తెరకెక్కబోతుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ప్రజెంట్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌లు ఓ సాంగ్ షూట్‌ను పూర్తి చేసుకున్నారు.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ ఈ సాంగ్ షూటింగ్‌కు సంబంధించిన పలు విషయాలు పంచుకుంటూ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపిరించింది. ‘ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో. ఆయన సెట్‌లోకి రాగానే అందరూ చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇటీవల మా ఇద్దరిపై ఓ పాటను చత్రీకరించారు. NTR డ్యాన్స్ వేసే స్పీడ్ చూసి నేను ఆశ్చర్యపోయా. ఆయన ఒక్క సెకనులోనే ఎలాంటి డ్యాన్స్ మూమెంట్ అయినా నేర్చుకోగలరు. నాకు మాత్రం 10 డేస్ పడుతుంది’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ జాన్వీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story