- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
రాకేశ్ మాస్టర్ మృతికి అదే కారణమా.. అయ్యో పాపం అంటున్న ఫ్యాన్స్!
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ అందించారు. టాలీవుడ్ లోని అగ్ర హీరోలందరితో ఆయన స్టెప్పులు వేయించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో లీడింగ్ కొరియోగ్రఫర్ గా ఉన్న శేఖర్ మాస్టర్ రాకేశ్ మాస్టర్ శిష్యుడనే విషయం తెలిసిందే. కాగా అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చేరిన రాకేశ్ మాస్టర్ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు.
కాగా రాకేశ్ మాస్టర్ మృతిపై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. కొరియోగ్రఫర్ గా సినీ అవకాశాలు తగ్గడంతో రాకేశ్ మాస్టర్ తాగుడుకు బానిస అయ్యారని, తాగి తాగి ఆయన కాలేయం, కిడ్నీలు దెబ్బతినడంతో మృతి చెందారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనకు సన్నిహితంగా ఉండే కొందరు మాత్రం అదేం కాదని, ఎండదెబ్బ తాకి చనిపోయారని చెబుతున్నారు. ఏదిఏమైనా ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా లక్షలు సంపాదించిన రాకేశ్ మాస్టర్.. చివరికి ఇలా చనిపోవడంతో సినీ లవర్స్ అయ్యో పాపం అంటున్నారు.
ఇవి కూడా చదవండి: