- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mr Bachchan: ప్రతీసారి హీరోయిన్‌ను అలా నలిపేయడం ఏంటి నాయనా.. మిస్టర్ బచ్చన్ సాంగ్‌పై ఫైర్ అవుతున్న నెటిజన్స్
దిశ, సినిమా: రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ చిత్రంతోనే భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. ఇక ఈ నెల 15న థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా మరో సాంగ్ విడుదల చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ పాటను వనమాలి రాశాడు. చాలా గ్యాప్ తర్వాత వనమాలి ఓ పెద్ద సినిమాకు సాహిత్యం అందించడం విశేషం.
ఇదిలా ఉంటే ఈ మూవీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. లిరిక్స్ పరంగా చాలా బాగున్న ఈ సాంగ్.. డాన్స్ పరంగా మాత్రం బి గ్రేడ్‌ను తలపిస్తోందని.. హీరోయిన్ అంగాంగ ప్రదర్శనే అంతిమం అన్నట్టుగా.. ఆమెను శరీరాన్ని అదే పనిగా తడమడమే రొమాన్స్ అన్నట్టుగా చిత్రీకరణ ఉందని.. కూతురు ఏజ్ ఉన్న హీరోయిన్‌తో రవితేజ చేసిన రొమాన్స్ చూస్తే అదోరకంగా ఉంది తప్ప నేచురల్‌గా లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఎంత కమర్షియల్ సినిమా అయినా.. లేస్తే అందరి గురించి అదే పనిగా నిక్కచ్చిగా ఉండాలని మాట్లాడే హరీశ్ శంకర్ లాంటి డైరెక్టర్ ఈ తరహా పాటలను ఎంకరేజ్ చేయడం ఏంటి అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రతి సారి హీరోయిన్‌ను అలా నలిపేయడం ఏంటీ నాయనా.. పాటంటే అర్థనగ్న ప్రదర్శనేనా అంటూ ఏకి పారేస్తున్నారు. ఇలాంటి చెత్త డాన్స్ ఉంటే ఎవరూ చూడరు అని విమర్శిస్తున్నారు.
కాగా దీనికంటే ముందు వచ్చిన పాటలోని డాన్స్ కొరియోగ్రఫీ పై కూడా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.