RRR స్టార్స్ కి జాతీయ అవార్డ్ రాకపోవడానికి కారణం ఇదేనా..!

by Prasanna |   ( Updated:2023-08-25 06:26:49.0  )
RRR స్టార్స్ కి జాతీయ అవార్డ్ రాకపోవడానికి  కారణం ఇదేనా..!
X

దిశ,వెబ్ డెస్క్: 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో అల్లు అర్జున్‌ సత్తా చాటాడు. ఇప్పటి వరకు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరికి దక్కని ఉత్తమ నటుడు అవార్డ్‌ అల్లు అర్జున్ కి దక్కింది. అటు అభిమానులతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ నటులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నటీ నటులు బన్నీకి అభినందనలు తెలుపుతున్నారు. జాతీయ అవార్డులు అందుకున్న లిస్టులో తెలుగు సినిమాలు చాలానే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన హీరోలు రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌ ల పేర్లు లేకపోవడంతో చాలా మంది షాక్ అవుతున్నారు. ఇద్దరు హీరోల్లో ఒక్కరు కూడా లేరు.. మూడవ వ్యక్తి అల్లు అర్జున్ కి ఈ అవార్డు దక్కడం షాకింగ్ గా ఉందని నెటిజెన్స్ అంటున్నారు. చరణ్‌, ఎన్టీఆర్ లు ఇద్దరూ సమానంగా స్క్రీన్‌ స్పేస్ ను పంచుకోవడం వల్లే అవార్డు రాలేదని కొందరి వాదన. అసలు ఇక్కడ ఏమి జరిగి ఉంటుందో అవార్డు ఎంపిక చేసిన వారికే తెలియాలి.

Read More: Varun Tej ‘Gaandeevadhari Arjuna’ ట్విట్టర్ రివ్యూ

Advertisement

Next Story