Ram Charan: బాబాయ్‌ రెడ్ టవల్ సెంటిమెంటునే అబ్బాయి రామ్ చరణ్ కూడా ఫాలో అవుతున్నాడా?

by Prasanna |
Ram Charan: బాబాయ్‌ రెడ్ టవల్ సెంటిమెంటునే అబ్బాయి రామ్ చరణ్ కూడా ఫాలో అవుతున్నాడా?
X

దిశ, వెబ్ డెస్క్ : సెప్టెంబర్ 07 న దేశమంతటా వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకున్నారు. అయితే, ఈ సందర్భంగా కొత్త సినిమాలకు సంబందించిన అప్డేట్ లు మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఇదే క్రమంలో రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం గేమ్ ఛేంజర్ నుంచి ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేస్తూ రెండో పాట ఈ నెలలో వస్తుందని అనౌన్స్ చేసారు. అయితే, ఇప్పుడు రామ్ చరణ్ ఫోటో నెట్టింట హల్చల్ చేస్తుంది. చూస్తుంటే .. అది ఓ పాటలోని ఫోటో అని తెలుస్తుంది. దీనిలో రామ్ చరణ్ తలకు రెడ్ టవల్ కట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు అందరి చూపు ఈ టవల్ పైనే ఉంది.

అసలు ఈ రెడ్ టవల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్లే బాగా ఫేమస్ అయింది. గబ్బర్ సింగ్ మూవీ టైమ్ లో ఫ్యాన్స్ కూడా వాడారు.. ఆ తర్వాత జనసేన పార్టీ నుంచి ఇంకా బాగా వైరల్ అయింది. ఇప్పుడు రామ్ చరణ్ తలకు ఉన్న రెడ్ టవల్ చూసి బాబాయ్ పవన్ తో పోలుస్తూ ఫోటోలు షేర్ చేస్తున్నారు.

గబ్బర్ సింగ్ మూవీలో తలకు పవన్ కళ్యాణ్ రెడ్ టవల్ చాలా సార్లు కట్టుకున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన ముఠామేస్త్రి మూవీలో కూడా ఒక కార్మికుడిగా రెడ్ టవల్ కట్టుకున్నారు. అయితే, ఇప్పుడు వీరిద్దరి పక్కన చరణ్ ఫోటో పెట్టి నాన్న, బాబాయ్ లను, కొడుకు సూపర్ అంటూ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed