మెగా ఫ్యామిలీలో అందరికీ మొదట అమ్మాయిలే జన్మిస్తున్నారా.. తెరపై కొత్త సెంటిమెంట్?

by samatah |   ( Updated:2023-06-20 08:45:34.0  )
మెగా ఫ్యామిలీలో అందరికీ మొదట అమ్మాయిలే జన్మిస్తున్నారా.. తెరపై కొత్త సెంటిమెంట్?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా వారసురాలు వచ్చేసింది. దీంతో కొనిదెల కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. రామ్ చరణ్, ఉపాసనల దంపతులు ఈరోజు ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మిచ్చారు. దీంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన అనేక వార్తలు ట్రెండ్ అవుతున్నాయి.

తెరపైకి మెగా సెంటిమెంట్ అనే కొత్త వార్త వైరల్ అవుతుంది. అదేమిటంటే? మెగాస్టార్ చిరంజీవికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు. ఇక అందులో మొదటి కూతురికి ఇద్దరు కూతుళ్లు సమర, సంహిత జన్మించగా, రెండో కూతురు శ్రీజకు కూడా నవిష్క, నివృత్తి ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్‌కు కూడా కూతురు పుట్టడంతో, మెగాస్టార్ చిరంజీవికి మొత్తం ఐదుగురు మనువరాళ్లు వచ్చారు. దీంతో చిరంజీవి ఫ్యామిలీలో ఇప్పటి వరకు అయిన డెలవరీలన్నింటిలో ఆడపిల్లలే జన్మించారు. వీరికి ఆడపిల్లనే సెంటిమెంట్ అంటూ ఓ వార్త వైరల్‌గా మారింది.

Read more: Ram Charan , Upasana Konidela :పాపకు జన్మనిచ్చిన రామ్ చరణ్ దంపతులు.. తారక్ ఏమోషనల్ పోస్ట్

Advertisement
Next Story