Devara: జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. అందుకే దేవర షూటింగ్ అంటే చాలా ఇష్టం అంటూ

by Kavitha |
Devara: జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. అందుకే దేవర షూటింగ్ అంటే చాలా ఇష్టం అంటూ
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’.ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుండగా.. పార్టు 1 సెప్టెంబర్‌ 27 న గ్రాండ్‌గా విడుదల కానుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం గురించి ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ అభిమానుల్లో జోష్‌ నింపుతోంది మూవీ టీమ్. ఇక ఈ సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్‌ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు దేవర షూటింగ్‌ టైంను ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా జాన్వీ తన ఫ్యాన్స్, ఫాలోవర్స్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో భాగంగా.. దేవర షూటింగ్‌ బ్రేక్‌లో లంచ్‌ టైంలో పసందైన విందు భోజనం ఫొటోను అందరితో పంచుకుంది. డైనింగ్ టేబుల్‌పై బిర్యానీ, చికెన్‌, డిషెస్‌తోపాటు పలు శాఖాహార వంటకాలున్న స్టిల్‌ షేర్ చేస్తూ.. దేవర షూటింగ్‌ను ఇందుకే ప్రేమిస్తున్నానంటూ ఫైర్‌, లవ్‌ ఎమోజీలను క్యాప్షన్‌గా ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా ఇప్పటికే దేవర నుంచి విడుదలైన గ్లింప్స్‌‌తో పాటు ఫియర్ సాంగ్‌ కూడా మిలియన్ వ్యూస్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఈ మూవీపై మరింత హైప్ పెంచుతుంది.




Advertisement

Next Story