- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
ఆకట్టుకుంటున్న ఇషా అంబానీ 3D గౌను...
దిశ, సినిమా: గుజరాత్ జామ్ నగర్‌లోని అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుక గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతోంది. వారి గురించి గంటకో వార్త వైరల్ అవుతుంది. కాగా ప్రస్తుతం జరుగుతున్నా ఈ అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో ఇప్పటికే దాదాపు అందరు సెలబ్రెటిలు హాజరయ్యారు. మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్ నుండి మొదలు బాలివుడ్ నుండి టాలీవుడ్ వరకు అందరూ స్టార్‌లు అక్కడకు చేరుకున్నారు. ఇక అక్కడ ఎంత మంది స్టార్ ఉన్నప్పటికి.. అంబానీ కూతురు ఇషా అందరి దృష్టిని ఆకర్షించింది.
అవును ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలో ఇషా కోచర్ లేబుల్ మిస్ సోహీ రూపొందించిన 3D ఎంబ్రాయిడరీ గౌనులో రాయల్ లుక్ తో మైమరిపించింది. ఈ డిజైనర్ డ్రెస్‌లో 3D చెర్రీ పువ్వులు , స్వరోవ్‌స్కీ స్ఫటికాల గంభీరమైన నెమలి, ఎంబ్రాయిడరీతో అల్లుకున్న మాగ్నోలియా పూల కొమ్మలతో ఈ కార్సెటెడ్ ఫిగర్-హగ్గింగ్ గౌను అందరిని ఫిదా చేసింది. కాగా ఈ ఇషా స్ప్రింగ్/సమ్మర్ 2024 గౌనును శిల్పకళా శాలువాతో కవరప్ చేసింది. అలా మొత్తానికి ఇషా 3D ఫ్రాక్ లో అందరి చూపు తన వైపు తిప్పుకుంది.