- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జబర్ధస్త్‌లోకి మంత్రి మల్లారెడ్డి, వైఎస్ షర్మిల..? టీం లీడర్ ఎవరంటే..! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: జబర్ధస్త్.. ఈ పేరే ఓ సంచలనం. ఎంతో మంది మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తెచ్చి నటీనటులుగా తీర్చిదిద్దిన వేదిక. ఈ ప్లాట్ ఫామ్‌పై పరిచయమైన ఎంతో మంది ఆర్టిస్టులు సినిమాల్లోనూ రాణిస్తున్నారు. హీరోలుగానూ మారారు. ఈ వేదిక ద్వారానే ఇమాన్యుయల్ కమెడియన్‌గా గుర్తింపు పొందారు. సినిమాల్లోనూ నటిస్తున్నారు. ముఖ్యంగా ఇమాన్యుయల్ - వర్ష జోడి అదిరిపోయిందనే చెప్పాలి. వీరిద్దరు కలిసి చేసే స్కిట్స్ బాగా పేలుతాయని అనడంలో సందేహం లేదు. కంటెస్టెంట్‌గా జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇమాన్యుయల్.. తాజాగా ఎక్స్‌ట్రా జబర్ధస్త్ టీం లీడర్ అయ్యారు. ‘ఇస్మార్ట్ ఇమాన్యుయల్’ పేరుతో టీంను పరిచయం చేశారు.
అయితే మొదటి స్కిట్‌తోనే ఇమాన్యుయల్ మంచి మార్కులు కొట్టేశారు. పొలిటికల్ లీడర్లను అనుకరిస్తూ చేసిన స్కిట్ చూసిన వీక్షకులు సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి, వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల ఇటీవల మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటినే తన తొలి స్కిట్‌గా మార్చుకున్నారు ఇమాన్యుయల్. స్కిట్‌లో భాగంగా ‘నీకు టీం లీడర్‌గా ఎలా ఇచ్చారు’ అని వర్ష అడగ్గానే.. ఇమాన్యుయల్.. ‘‘కష్టపడ్డ.. రైటర్‌గా చేసిన.. భాస్కర్ స్కిట్లు చేసిన. వెంకీ స్కిట్లు చేసిన.. కార్తీక్ స్కిట్లు చేసిన.. టీం లీడర్‌ను అయ్యా.. సక్సెస్ అయ్యా..’’ అంటూ మంత్రి మల్లారెడ్డిని ఇమిటెట్ చేస్తూ కామెడీ చేశారు.
అలాగే ‘టీం లీడర్ అంటే ఎవరు..?’ అని మరో కంటెస్టెంట్ అడగ్గా.. ‘అసలు టీం లీడర్ అంటే అర్థం తెలుసా అండి. టీం లీడర్ అంటే ఎవరండి..? టీంను ముందుండి నడిపించేవాడు టీం లీడర్ అండి..’ అంటూ వైఎస్ షర్మిలను అనుకరిస్తూ చెప్పడంతో జడ్జీలు నవ్వులు చిందించారు. ఇదే సమయంలో జోర్దార్ సుజాత రాగా.. వదిన నేను టీం లీడర్‌ను అయ్యా.. ఆశీర్వదించండి అంటూ కాళ్లు మొక్కుతాడు.. దానికి సుజాత రియాక్షన్ ఇస్తూ.. ఏ.. ఏంటి నువ్వు కూడా మా ఆయన(రాకేశ్)లాగే కాళ్ల మీదపడుతావు అంటూ ఓ పంచ్ వేసింది. దీంతో రాకేశ్ ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్‌తో జబర్ధస్త్ హాల్ గొల్లుమంటుంది. అయితే ఈ ఎపిసోడ్ చూసిన వాళ్లంతా ఎట్టకేలకు ఇమాన్యుయల్ టీం లీడర్ అయ్యి.. మొదటి స్క్రిట్‌లోనే మంత్రి మల్లారెడ్డిని, వైఎస్ షర్మిలను టీంలోకి తీసుకున్నారు కదా అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.