ఛాన్స్‌ల కోసం వెళ్తే కమిట్ కావాలన్నారు: Jabardasth Rohini సెన్సేషనల్ కామెంట్స్

by Anjali |   ( Updated:2023-07-30 10:11:44.0  )
ఛాన్స్‌ల కోసం వెళ్తే కమిట్ కావాలన్నారు: Jabardasth Rohini సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై సిరీయల్స్‌లో నటించిన రోహిణి.. బిగ్ బాస్‌ షోలో అవకాశాన్ని దక్కించుకుని ప్రస్తుతం తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు జబర్దస్త్‌‌లో ఏకంగా టీం లీడర్‌గా చేస్తూ.. ఓ వైపు సినిమాల్లో ఛాన్స్‌లు కొట్టేస్తుంది ఈ బుల్లితెర భామ. తాజాగా రోహిణి ఓ ఇంటర్వ్యూలో హాజరై.. ‘నేను ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో అవకాశాల కోసం వెళ్లినప్పుడు, నాతో కమిట్ అవుతావా? అంటూ అడిగారు. దీంతో అక్కడి నుంచి వచ్చేసి బాధపడ్డాను. మళ్లీ ఇలాగే ఆడిషన్స్ కోసం వెళ్లగా.. అక్కడ నా ఫాదర్ ఏజ్ ఉన్న ఓ వ్యక్తి నీకు ఛాన్స్ ఇస్తా కానీ నాకేంటి? అని అడిగాడు. అక్కడ కూడా రిజెక్ట్ చేసి వచ్చేశా. ఇలాంటివి చాలా సార్లు ఎదుర్కొన్నాను. కానీ ఎప్పుడు అలాంటి తప్పుడు మార్గంలో నేను వెళ్లలేదు. నాకు తగ్గ టాలెంట్‌కు ఏ అవకాశం వస్తే దానితోనే సంతృప్తి పడుతాను తప్ప పెద్దగా గోల్స్ ఏమీ పెట్టుకోను’’ అంటూ రోహిణి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ జబర్దస్త్ నటి చేసినటువంటి వ్యాఖ్యలు నెట్టింట చర్చానీయాంశంగా మారాయి.

Also Read: ఛాన్స్‌ల కోసం వెళ్తే కమిట్ కావాలన్నారు: Jabardasth Rohini సెన్సేషనల్ కామెంట్స్

Advertisement

Next Story