- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సినిమా సెట్‌లో రక్తస్రావం అయి అబార్షన్ అయితే ఎవ్వరూ నమ్మలేదు: మంత్రి స్మృతి ఇరానీ
దిశ, వెబ్‌డెస్క్: నటి, స్మృతి ఇరానీ తన కెరీర్‌ను సీరియల్స్‌తో ప్రారంభించి ప్రస్తుతం కేంద్ర మంత్రి స్థానానికి ఎదగడం గొప్ప విశేషం. ఆమె 2011లో ఎన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైబోలో తెలంగాణ’ చిత్రంలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కేంద్ర మంత్రిగా ఉన్నారు. మహిళా శిశు సంక్షేమ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె కెరీర్‌లో మూడు సినిమాల్లో నటించగా, అందులో ఒకటి తెలుగు సినిమా కావడం విశేషం. స్మృతి ఇరానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆమెకు షూటింగ్‌లో ఎదురైన అవమానాల గురించి పంచుకున్నారు. ‘‘క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ’ నాకు ఎంతో పేరుని తెచ్చిపెట్టిందని, కానీ ఆ సీరియల్ షూటింగ్ టైమ్‌లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఆ విషయం నాకు తెలియలేదు,
ఒక రోజు షూట్ చేస్తున్నప్పుడు నీరసంగా అనిపించి, ఓపిక లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోతానని అడిగాను. కానీ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల వద్దన్నారు. ఏం చేసేది లేక సాయంత్రం వరకు సెట్‌లోనే ఉన్నాను. ఆ రోజు సాయంత్రం నాకు రక్తస్రావం అయ్యింది. పైగా బాగా వర్షం పడుతుంది. ఆటోని పిలిపించుకుని ఆస్పత్రికి వెళ్లాను. ఆస్పత్రికి వెళ్లాక అబార్షన్ అయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఎంతో కుంగిపోయాను. ఆ బాధాకరమైన ఘటనతో షూట్ నుంచి కొంత గ్యాప్ తీసుకుందామనుకున్నా, కానీ షూటింగ్ కి రావాల్సిందే అని పట్టుబట్టారు. నేను నాటకం ఆడుతున్నట్టు కల్పితాలు సృష్టించారు. నాకు అసలు అబార్షనే కాలేదని, అబద్దం చెబుతున్నానని.. ఓ వ్యక్తి వదంతులు పుట్టించాడు. ఆ సమయంలో వారిని నమ్మించడం కోసం రిపోర్ట్‌లు తీసుకెళ్లి ఆ ప్రోగ్రామ్ క్రియేటర్ ఏక్తాకపూర్‌కి చూపించాను.’’ అని స్మృతి ఇరానీ తెలిపారు. ఆర్థిక పరిస్థితులు...ఇంటి ఈఎంఐలు, ఇతర ఖర్చులు గుర్తుకు వచ్చి తిరిగి సెట్స్‌కి వెళ్లానని చెప్పారు. ఇండస్ట్రీలో తాను పడ్డ బాధలను గుర్తు చేసుకుంటూ మంత్రి ఇరానీ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read more:
ఒకే స్టేజ్‌పై హాట్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన బోల్డ్ బ్యూటీస్.. నెటిజన్లకు పండగే (వీడియో)