నిహారిక ఆ సినిమాను రిజెక్ట్ చేసి ఉండకపోతే.. స్టార్ హీరోయిన్ అయ్యుండేది..

by Anjali |   ( Updated:2023-11-22 12:05:22.0  )
నిహారిక ఆ సినిమాను రిజెక్ట్ చేసి ఉండకపోతే.. స్టార్ హీరోయిన్ అయ్యుండేది..
X

దిశ, సినిమా: మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా సరే వెనుకడుగు వేయకుండా కెరీర్ మీద ఫోకస్ పెట్టి నటిగా, నిర్మాతగా ఎదగడానికి కృషి చేస్తోంది. అయితే నిహారిక గతంలో చేతి దాకా వచ్చిన మంచి సినిమాలను రిజెక్ట్ చేయడం జరిగింది. వీటిలో ఓ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఒకవేళ ఆ చిత్రాన్ని నిహా చేసి ఉంటే ఆమె లెవెల్ ఇప్పుడు వేరేలా ఉండేది. ఇంతకీ ఆమె మిస్ చేసుకున్న సినిమా ఏంటంటే.. నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘100% లవ్’. ఈ మూవీని అంతా చూసే ఉంటారు. గీత ఆర్ట్స్ బ్యానర్‌పై సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2011లో వచ్చి సూపర్ హిట్ అయింది. ఇందులో హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించింది. ఇక ఈ మూవీ హిట్ తర్వాత తమన్నకు మంచి అవకాశాలు రావడంతోపాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. అందుకే నిహారిక ఈ సినిమా ఒప్పుకుని చేసి ఉంటే కచ్చితంగా ఈరోజు పెద్ద పొజిషన్‌లో ఉండేది అంటున్నారు అభిమానులు.

Advertisement

Next Story

Most Viewed