అతనితో శృంగార సీన్ అనగానే భయమేసి పారిపోయా.. అర్జున్ రెడ్డి బ్యూటీ షాకింగ్ కామెంట్స్!

by Hamsa |
అతనితో శృంగార సీన్ అనగానే భయమేసి పారిపోయా.. అర్జున్ రెడ్డి బ్యూటీ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ షాలిని పాండే అందరికీ సుపరిచితమే. విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. మొదటి మూవీలోనే శృంగార్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించి అందనినీ షాక్‌కు గురి చేసింది. ఆ తర్వాత ఇద్దరి లోకం ఒకటే, మహానటి, నిశ్శబ్దం, 118 వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ బోల్డ్ ఫొటోలతో రచ్చ చేస్తుంది. అయితే షాలిని పాండే నటించిన తాజా చిత్రం ‘మహారాజ్’. దీనిని సిద్దార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించగా.. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

అయితే ఈ చిత్రం బిగ్ స్క్రీన్‌పై విడుదల కానప్పటికీ.. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 21 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో.. తాజాగా, ప్రమోషన్స్‌లో పాల్గొన్న షాలిని పాండే ఓ సీన్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ఈ చిత్రంలో నటుడు జైదీప్‌తో ఒక శృంగార సీన్‌లో నటించాను. ఆ సీన్ షూట్ చేసే ముందు నేను బయటకు పరిగెత్తుకుంటూ పారిపోయాను. చాలా ఒత్తిడిగా అనిపించింది. చీకటి వాతావరణం ఉన్నప్పుడు నాకు భయం ఎక్కువ అని డైరెక్టర్ చెప్పాను. దీంతో నాకు ప్రశాంతమైన వాతావరణం కావాలని దర్శకుడిని అడిగాను. ఆయన అర్థం చేసుకుని నాకు స్పేస్ ఇవ్వడంతో ఆ సన్నివేశాన్ని పూర్తి చేయగలిగాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ షాలిని కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే.. అర్జున్ రెడ్డిలో అంత బోల్డ్ సీన్స్‌లో నటించిన షాలిని భయపడటమేంటని అంటున్నారు.



Next Story