భార్య వదిలేసింది.. ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. స్టార్ నటుడు మనోజ్ దీన స్థితి

by Disha Web Desk 7 |
భార్య వదిలేసింది..  ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. స్టార్ నటుడు మనోజ్ దీన స్థితి
X

దిశ, సినిమా: ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు నటుడు మనోజ్ బాజ్‌పేయి. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈయన.. ఒకానొక టైంలో ఆత్మహత్య చేసుకుందాం అని అనుకున్నారట. ఈ రోజు నటుడు మనోజ్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బీహార్‌లోనరి బెల్వా అనే గ్రామంలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు మనోజ్. చిన్నప్పటి నుంచే నటన అంటే ఆయనకు ఎంతో ఇష్టమట. ఈ క్రమంలోనే 17 ఏళ్ల వయసులో ఢిల్లీకి వచ్చాడు. అక్కడ కాలేజ్ చదువుతూనే నాటక రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఢిల్లీలోని ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో చేరాలన్నది ఆయన కలట. అది నెరవేరక పోవడంతో ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడట. కానీ, ఫ్రెండ్స్ ధైర్యం చెప్పారట. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆయన.. దీన స్థితి ఈ రోజు ఓ స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక మనోజ్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. గతంలో బీహార్‌కు చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే కష్టకాలంలో ఆమె అతడిని వదిలి వెళ్లిపోయిందట. ఇక ఆ తర్వాత నటి షబానా రాజాను మనోజ్ వివాహం చేసుకున్నారు. కాగా.. ఇప్పుడు ఈ స్టార్ నటుడు వెబ్ సిరీస్‌లు, సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవల ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌లో నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు మనోజ్.



Next Story