‘శృంగారం అంటే నాకు చాలా ఇష్టం.. దానిలో ఆ శక్తి ఉంది’ స్టార్ నటుడు సంచలన కామెంట్స్

by Anjali |
‘శృంగారం అంటే నాకు చాలా ఇష్టం.. దానిలో ఆ శక్తి ఉంది’ స్టార్ నటుడు సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: టీవీ వ్యాఖ్యాత, సినీ నటుడు, మోడల్, నిర్మాతగా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు అర్జున్ రాంపాల్. ఈయన 2001 లో ‘ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్’ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత నెయిల్ పాలిష్, ది రేపిస్ట్, దక్కడ్, ది బ్యాటిల్ అఫ్ భీమా కోరెగాన్, హరి హర వీరమల్లు(తెలుగు మూవీ), నాస్తిక్ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. వీటితో పాటు ఇంగ్లీష్ చిత్రాల్లో నటించి మరింత ఫేమ్ దక్కించుకున్నాడు.

అయితే అర్జున్ రాంపాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై సంచలన కామెంట్స్ చేశాడు. అర్జున్ రాంపాల్ మాట్లాడుతూ.. ‘‘శృంగారం అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించాడు. సెక్స్ అత్యంత ముఖ్యమైన అవసరమన్నాడు. ఇద్దరి మధ్య ఫిజికల్ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలిపాడు. నేను అయితే నా జీవితంలో శృంగారాన్ని చాలా ముఖ్యమైన భాగంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఒక మహిళతో శారీరకతను పంచుకోవడంలో ఏదో శక్తి ఉందని నేను అనుకుంటున్నానన్నాడు. సెక్స్‌లో పాల్గొన్నాక భారీ మార్పులు వస్తాయని చెప్పాడు. కాగా జీవితంలో శృంగారం అనేది అవసరమని భావిస్తున్నానంటూ’ అర్జున్ రాంపాల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

అక్రమ సంబంధాలపై ప్రశ్న ఎదురవ్వగా.. కొంతమంది వేరే వ్యక్తులతో ఎఫైర్స్ పెట్టుకోవడం తమకు తాముగా ఏర్పరచుకున్న అలవాటు అన్నారు. ఎంతో మంది బయట అక్రమ సంబంధాలు పెట్టుకుని భార్యలతో ఎంతో హ్యాపీగా ఉన్నట్లు బిహేవ్ చేసేవాళ్లను చాలా మందిని చూశానన్నాడు. తర్వాత తను చాలా 21 ఏళ్లకే చాలా చిన్న ఏజ్‌లోనే పెళ్లి చేసుకున్నానని తెలిపాడు. అంత తక్కువ వయసులో వివాహం చేసుకోవడం తప్పేనని అన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత జెసియాకు విడాకులు ఇచ్చానని వెల్లడించాడు. వారికి మహికా రాంపాల్ అండ్ మైరా రాంపాల్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పేర్కొన్నాడు.

Advertisement

Next Story