- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సక్సెస్ కంటే.. ఫెయిల్యూర్ వల్ల ఎక్కువ నేర్చుకున్నా.. స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. మొదటి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఇంస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. అయితే.. ‘ఉప్పెన’ మూవీ తర్వాత ఆ రేంజ్ హిట్ ఒక్కటి కూడా పడలేదు. దీంతో వరుస ఫ్లాపులు రావడంతో ఈ బ్యూటీ గ్రాఫ్ కూడా డౌన్ అయింది. ఇక ఇటీవల శర్వానంద్ ‘మనమే’ చిత్రంతో వచ్చినప్పటికీ ఈ సినిమా కూడా అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు. అయితే.. ప్రజెంట్ తెలుగులో ఏ మూవీ అనౌన్స్ చెయ్యని ఈ అమ్మడు.. ‘అజయంతే రందం మోషణం’ మూవీతో మలయాళ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది.
ఇందులో టోవినో థామస్ హీరోగా నటిస్తుండగా.. జితిల్ లాల్ దర్శకత్వం వహించాడు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 12 న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా కృతి శెట్టి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ‘‘ఉప్పెన’ సినిమా పెద్ద హిట్ అయింది. దీంతో ఓ సెక్షన్ జనం నాకు ఫ్లాప్ వస్తుందని ఎదురుచూశారు. నాకు ఫ్లాప్ వస్తే వేలెత్తి చూపించాలనుకున్నారు. అయితే నేను హిట్-ఫ్లాప్ ఒకేలా తీసుకున్నాను. హిట్ వచ్చిన, ఫ్లాప్ వచ్చిన ఆ పూర్తి క్రెడిట్ నాది కాదు. అలాగే.. తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకున్నాను. ఓ సక్సెస్ కంటే, ఫెయిల్యూర్ వల్లనే ఎక్కువ నేర్చుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.
- Tags
- krithi shetty