Akshay Kumar: నన్ను వ్యక్తిగత జీవితంతో పాటు, సినీ కెరీర్‌లోనూ చాలా మంది మోసం చేశారు- స్టార్ హీరో సంచలన కామెంట్స్

by Kavitha |
Akshay Kumar: నన్ను వ్యక్తిగత జీవితంతో పాటు, సినీ కెరీర్‌లోనూ చాలా మంది మోసం చేశారు- స్టార్ హీరో సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌లో నటించి తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇతనికి బ్యాడ్ టైమ్ నడుస్తున్నదనే చెప్పాలి. ఈయన చేసే ప్రతి సినిమాలు డిజాస్టర్స్‌గా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్షయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘సర్ఫిరా’ మూవీ రీసెంట్‌గా థియేటర్లలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్షయ్ కుమార్ తన కెరీర్‌లోని పరాజయాలతో పాటు జరిగిన మోసాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఆయన మాట్లాడుతూ.. “నన్ను వ్యక్తిగత జీవితంతో పాటు, సినీ కెరీర్‌లోనూ చాలా మంది మోసం చేశారు. అన్ని రంగాల్లో మోసం చేసే వాళ్ళు ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో కూడా అలాంటి వారున్నారు. అలా మోస పోయిన వాళ్లలో నేను కూడా ఉన్నాను. కొంతమంది నన్ను చీట్ చేశారు. ఇక వారు నన్ను మోసం చేశారన్న విషయం తెలిసిన తర్వాత వారికి దూరంగా ఉండటం మొదలుపెట్టాను. వాళ్లతో కనీసం మాట్లాడను. కొంత మంది నిర్మాతలు నాకు ఇస్తానని చెప్పిన రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. నా దృష్టిలో ఆడిన మాట తప్పడం అనేది కూడా మోసం కిందికే వస్తుంది” అంటూ అక్షయ్ కుమార్ వాపోయారు. ప్రస్తుతం ఇతను చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటించిన ‘ఖేల్ ఖేల్ మే’ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో తాప్సీ పన్ను, వాణి కపూర్, అమ్మి విర్క్, ఆదిత్య సీల్, ప్రగ్యా జైస్వాల్, ఫర్దీన్ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Next Story