జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయని ఊహించలేదు.. లవ్ చేయడం వల్లే ఇలా జరిగింది: లావణ్య త్రిపాఠి

by Anjali |   ( Updated:2024-01-25 05:09:23.0  )
జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయని ఊహించలేదు.. లవ్ చేయడం వల్లే ఇలా జరిగింది: లావణ్య త్రిపాఠి
X

దిశ, సినిమా: మెగా కోడలు లావణ్య త్రిపాఠి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో బిగ్‌బాస్ సీజన్-3 లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అభిజిత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే లావణ్యకు పెళ్లయ్యాక మొదటిసారిగా మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ ముద్దగుమ్మకు వెబ్ సిరీస్ విషయాలతో పాటు తన అత్తారింటి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. వరుణ్ తేజ్ తో లైఫ్ ఎలా ఉందని అడగ్గా..

‘జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయో ఎవరూ ఊహించరు. ఇంకా మన పెళ్లి ఎవరితో అవుతుందో అస్సలు ఊహించలేం. నేను టాలీవుడ్ ఇండస్ట్రీకి రావడం.. వరుణ్‌తో ప్రేమలో పడటం.. పెళ్లి చేసుకోవడం ఇదంతా నేను అస్సలు ఊహించలేదు. నా ప్రేమే నా హ్యాపీనెస్‌కు కారణమయ్యింది. నా జీవితం ఇలా మలుపు తిరగడానికి నా ప్రేమే కారణం. నేను వరుణ్‌తో చాలా హ్యాపీగా ఉన్నాను’’ అంటూ లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బ్యూటీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరీస్ కోసం మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్‌లో లావణ్య ఎలా నటించబోతుంది? ఎలాంటి పాత్రలో చేస్తుంది? మెగా ఫ్యామిలీని మెప్పించనుందా? సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చ మొదలుపెట్టారు. బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి నటించే ఈ వెబ్ సిరీస్ కోసం ఫిబ్రవరి 2 వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.

ఆ విషయంలో నిహారిక టార్చర్ పెడుతోంది.. షాకింగ్ నిజం చెప్పిన లావణ్య త్రిపాఠి

Advertisement

Next Story