డైరెక్టర్ అలా చేసేసరికి ఓకే పెట్టేయ్ అన్నాను.. నావల్ల కాదంటే కంఫార్టబుల్‌గా ఉంటేనే చేద్దామన్నారు: సదా షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 9 |
డైరెక్టర్ అలా చేసేసరికి ఓకే పెట్టేయ్ అన్నాను.. నావల్ల కాదంటే కంఫార్టబుల్‌గా ఉంటేనే చేద్దామన్నారు: సదా షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అపరిచితుడు చిత్రం అప్పట్లో ఓ రేంజ్‌లో హిట్ టాక్ సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇందులో విక్రమ్, ప్రకాశ్ రాజ్ నటన గురించైతే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అక్కర్లేదు. మూడు క్యారెక్టర్‌లో నటిస్తూ విక్రమ్ తెలుగు ప్రేక్షకుల్ని తెగ ఆకట్టుకున్నాడు. కథానాయికగా నటించిన హీరోయిన్ సదా నటనకైతే యువత ఫిదా అయ్యారనడంలో అతిశయోక్తిలేదు. ఈ చిత్రంలో దర్శకుడు శంకర్, సదాను గ్లామరస్‌గా చూపించాడు. రాము, రెమో, అపరిచితుడు మధ్య నలిగిపోయే అమ్మాయిగా ఎంతో బాగా నటించింది. మొత్తానికి విక్రమ-సదా మధ్య కెమిస్ట్రీ జనాలందర్ని ఆకట్టుకుంది. ఇకపోతే ఈ చిత్ర షూటింగ్ సమయంలో సదా-విక్రమ్ ను బిహేవియర్ చూసి దర్శకుడు షాక్ అయ్యేవారట. ఎందుకంటే హీరోయిన్ విక్రమ్ ను తంగచి (అన్నా) అని పిలిచేదట.

ఓ వైపు హీరో-హీరోయిన్‌గా నటిస్తూ మరోవైపు ఈ బ్రదర్-సిస్టర్ రిలేషన్ ఏంట్రా బాబు అని అంటూ శంకర్ తల పట్టుకునేవారట. అలాగే డైరెక్టర్ వీరిద్దరి బంధం అన్నా చెల్లెల్లుగా ఉంటే సినిమాను ఎక్కువ మంది వీక్షించరని శంకర్.. హీరో- హీరోయిన్ కు గట్టి క్లాస్ ఇచ్చారట. ఇక అప్పటి నుంచి అన్నా అని పిలవడం మానేశానంటూ సదా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక డైరెక్టర్ ఈ సినిమా కోసం నాకు కాల్ చేసినప్పుడు ప్రాంక్ కాల్ అనుకున్నానని వెల్లడించింది. దీంతో పెట్టేయ్ అమ్మా అన్నానని తెలిపింది. ఎందుకైన మంచి ఓసారి చేసి మాట్లాడమ్మా అని మా అమ్మ చెప్పిందని, మాట్లాడేసరికి నిజంగానే సినిమా కోసమేనని అర్థమైందని చెప్పుకొచ్చింది. మరీ ఎక్స్‌ఫోజింగ్ అయితే చేయలేనని చెప్పానని తెలిపింది. ఓకే నీకు కంఫార్టబుల్ గా ఉంటేనే చేద్దామన్నారని సదా వెల్లడించింది.

Read More..

మూడో భర్తకు కూడా విడాకులు ఇచ్చేసిన స్టార్ సింగర్.. అధికారిక ప్రకటనతో షాక్‌లో ఫ్యాన్స్!

Next Story

Most Viewed