- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ జీతం ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!!
దిశ, సినిమా: ప్రియుడితో కలిసి రేపు (ఫిబ్రవరి)వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతున్న టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రకుల్ 2009 లో గిల్లి అనే కన్న సినిమాతో వెండితెరకు పరిచయమైంది. తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. అగ్ర హీరోలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోల సినిమాల్లో నటించింది ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఈ సినిమాలకు కోట్లలో పారితోషికం అందుకుంది. అయితే రకుల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరై తన కెరీర్ ఎలా ప్రారంభమైంది? స్టార్టింగ్ ఎంత జీతం తీసుకుంది అనే విషయాలపై మాట్లాడింది. ‘సినీ ఇండస్ట్రీకి వచ్చాక కూడా మా అమ్మ నాకు తోడుగా ఉంది. 25 సంవత్సరాల వరకు చిన్నపిల్లలా నా వెంటే ఉంటూ నా పట్ల కేర్ తీసుకుంది. నేను మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేశా. నా ఫస్ట్ సంపాదన 5 వేల రూపాయలు. ఈ సక్సెస్ జర్నీలో పేరెంట్స్, సన్నిహితుల ప్రోత్సాహం, సపోర్ట్ ఎంతో ఉంది. వీరు కనుక లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు’’ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది.
ఇక రకుల్ ప్రీత్ సింగ్.. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఇన్నేళ్లు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. రేపు గోవాలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు రకుల్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రముఖులు హాజరు కానున్నారు.
Read More..
కమిట్మెంట్ అడిగి బలవంతం చేసేవారు.. సిరీయల్ నటి ఎమోషనల్ కామెంట్స్