కాబోయే వాడు బెడ్ ఎక్కితే సింహంలా ఉండాలంటూ.. రెండో పెళ్లికి రెడీ అయిన హీరోయిన్ Amala Paul

by Anjali |   ( Updated:2023-08-25 16:10:04.0  )
కాబోయే వాడు బెడ్ ఎక్కితే సింహంలా ఉండాలంటూ.. రెండో పెళ్లికి రెడీ అయిన హీరోయిన్ Amala Paul
X

దిశ, సినిమా: మలయాళం నుంచి హీరోయిన్‌గా ఎదిగిన అమలా పాల్.. భాషతో సంబంధం లేకుండా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో ఇప్పుడు అడపాదడపా సినిమాలు తీస్తొంది. ఇక ఈ నటి పెళ్లై విడాకులు తీసుకుని చాలా కాలం అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అమలా పాల్ సోషల్ మీడియా వేదికగా ఆమెకు రెండో పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉన్నట్లు తెలిపింది. ‘నేను మళ్లీ రెండో పెళ్లి చేసుకుంటాను. కానీ నేను మ్యారేజ్ చేసుకునే వ్యక్తి మాత్రం బెడ్రూంలో సింహంలా, కండలు తిరిగిన వాడై ఉండాలి. అంతేకాదు ప్రేమ, దయ, జాలి మరీ ముఖ్యంగా నాతో సరదాగా ఫన్నీగా ఉండాలి. చెప్పాలంటే కాబోయే భర్త విషయంలో నా తండ్రి నాకు ఆదర్శం’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : పెళ్లికి ముందే లావణ్య గురించి తన అన్నకు అలా చెప్పిన నిహారిక..?

Advertisement

Next Story