- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
టాలీవుడ్ స్టార్ హీరో కూతురితో శింబు పెళ్లి.. త్వరలో అధికారిక ప్రకటన

దిశ, సినిమా: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ గా ఎదిగిన శింబు.. ఒకప్పుడు లవ్, బ్రేకప్, అమ్మాయిలు అంటూ ఎప్పుడూ రూమర్స్ ఎదుర్కొనేవాడు. డైరెక్టర్ కొడుకుగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన ఇష్టారీతిన వ్యవహరిస్తాడని.. హీరోయిన్ల విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడనే ఓ ట్యాగ్ పడిపోయింది. ముందుగా నయనతారతో రిలేషన్, కిస్, హగ్.. తర్వాత త్రిషతో ప్రేమాయణం.. రీసెంట్ గా హన్సికతో లవ్ స్టోరీ.. ఇన్ని జరిగినా ఒక్కటి కూడా పెళ్లి దాకా వెళ్లలేదు. దీంతో తను అమ్మాయిలను వాడుకుని బ్రేకప్ చెప్పేస్తాడనే గుసగుసలు వినిపించాయి. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా శింబు పెళ్లి ప్రస్తావన నెట్టింట వైరల్ అవుతుంది.
టాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో కూతురిని శింబు మ్యారేజ్ చేసుకోబోతున్నాడని.. ఇప్పటికే ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నాయని తెలుస్తుంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. కాగా ఎంగేజ్మెంట్, పెళ్లి 15 రోజుల వ్యవధిలో ఉండబోతుందని.. ఆగస్టులో ఈ తంతు పూర్తి కానుందని సమాచారం. ఈ న్యూస్ వైరల్ కావడంతో ఇప్పటికైనా తమ హీరో ఓ ఇంటి వాడు కాబోతున్నాడని సంబరపడుతున్నారు అభిమానులు. కాగా ఒకప్పుడు అమ్మాయిల చుట్టే తిరిగే శింబు.. ఈ మధ్య భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నాడు.