విడాకులు తీసుకోబోతున్న Hero Nitin.. భార్యకు దూరంగా ఉండనున్నారా?

by samatah |   ( Updated:2022-12-07 05:12:48.0  )
విడాకులు తీసుకోబోతున్న Hero Nitin.. భార్యకు దూరంగా ఉండనున్నారా?
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు చిత్ర పరిశ్రమలో విడాకుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సమంత, నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. దీంతో వీరిపై చాలా ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ విడాకులు తీసుకోబుతున్నట్లు ఓ రూమర్ నెట్టింట్లో తెగ హల్ చల్ అవుతుంది.

మాచార్ల నియోజక వర్గం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం అందుకున్న విషయం తెలిసిందే. దీంతో నితిన్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఆచీ తూచీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు చేయబోయే మూవీపై స్పెషల్ ఫొకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే నెక్స్ట్ ప్రాజెక్టును రైటర్ మరియు డైరెక్టర్ వక్కంతం వంశీ తో మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా భీష్మ వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుములతో కూడా చేతులు కలపడం కోసం ఈ యంగ్ హీరో రెడీ అవుతున్నారట. ఈ తరుణంలో నితిన్ తన భార్యకు దూరంగా ఉండబోతున్నారని విడాకులు కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. కానీ ఈ వ్యవహారం అంతా తన నిజ జీవితంలో కాదని కేవలం రీల్ లైఫ్ లో అని అంటూ అంటున్నారు. వెంకీ కుడుములడైరెక్షన్లో రానున్న ఈ మూవీలో తన భార్య నుంచి విడాకులు తీసుకొని తన జీవితాన్ని గడుపుతారని తెలుస్తోంది.


Read More...

HIT 2 box office collection Day 4: నాలుగు రోజుల కలెక్షన్స్

Advertisement

Next Story