- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్టేజి మీద జీవితాలతో ఆడుకునే వాడు గురువు కాదు.. పవన్‌ను ఉద్దేశిస్తూ పూనమ్ సంచలన పోస్ట్

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ పలు చిత్రాల్లో నటించి తన అందంతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటోంది. ఈ అమ్మడు పవన్ కల్యాణ్‌పై పలు వివాదాస్పద పోస్టులు పెడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.
తాజాగా, పూనమ్ కౌర్ గురు పౌర్ణిమ నాడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ సంచలన పోస్ట్ షేర్ చేసింది. ‘‘ ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. రామ్.. డిక్ అండ్ హరి అని ప్రతి ఒక్కరిని గురువు అని పిలవద్దని నీతులు చెప్పి స్టేజి మీద జీవితాలతో ఆడుకునే వాడు గురువు కాదు. మీకు దారి చూపించేవారు గురువు అవుతారు’’ అంటూ రాసుకొచ్చింది. దీంతో టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ పవన్‌ను గురువు అంటూ చేసిన ట్వీట్‌కు ఇలా పోస్ట్ పెట్టిందని నెటిజన్లు అనుకుంటున్నారు. ప్రస్తుతం పూనమ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read: హైదరాబాద్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. ఎందుకో తెలుసా?