- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిర్మాతల వేధింపులు తట్టుకోలేక చనిపోవాలనుకున్న.. నటి సంచలన కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్ల, నిర్మాతల, కో స్టార్స్ వేధింపులు ఎదుర్కొనే ఉంటారు. కొంత మంది అయితే వాటిని తట్టుకుని ఇండస్ట్రీలో ముందుకు పోవాలని చూస్తారు. కానీ, కొందరు నటీమణులు మాత్రం ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బుల్లి తెర నటి నిర్మాతల వేధింపుల గురించి చెప్పుకొచ్చింది.
‘తారక్ మెహతా కా ఉల్టా చమ్మా’ టీవీ షో గురించి అందరికీ తెలిసిందే. హిందీ ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ షో కొన్ని సంవత్సరాల నుంచి విజయవంతంగా నడుస్తోంది. అలాంటి షో ఈ మధ్యకాలంలో తరచూ వివాదాలకు కేరాఫ్‌గా మారింది. ఆ షో నుంచి బయటకు వచ్చిన పలువురు నటులు నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మోనికా భడోరియా కూడా నిర్మాతలు చేసిన పనిని చెప్పుకొచ్చారు.
‘‘షో చేస్తున్న సమయంలో నన్ను టార్చర్ చేశారని ఆ సమయంలో చనిపోవాలని అనిపించిందని ఆమె పేర్కొన్నారు. అంతే కాకుండా తనతో ప్రొడ్యూసర్లు వెట్టి చాకిరీ చేయించుకున్నారని, కానీ నాకు ఇవ్వాల్సిన పారితోషికం మాత్రం ఇవ్వలేదని ఆమె అన్నారు. తన తల్లి క్యాన్సర్‌తో బాధ పడుతున్న సమయంలో షో యూనిట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లభించ లేదు. మా అమ్మ దగ్గర నైట్ అంతా ఆసుపత్రిలో ఉండేదాన్ని. నేను ఉన్న పరిస్థితి తెలిసి కూడా ఉదయాన్నే షూటింగ్‌కు రావాలని చెప్పేవారు. అలా అని షూటింగ్ వెళ్లాక అక్కడ నన్ను వెయిట్ చేయించేవారని ఆమె తెలిపారు. మా కుటుంబంలో నేను ఎన్నో విషాదాలను ఎదుర్కొన్నానని తక్కువ సమయంలోనే అమ్మను, అమ్మమ్మను కోల్పోయానని’’ చెప్పుకుంటూ ఆమె ఆవేదనకు గురయ్యారు. కాగా.. మోనికా భడోరియా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read..
Mahesh Babu వల్ల ఆ డైరెక్టర్‌కు రూ.7 కోట్ల నష్టం.. అసలేం జరిగిందంటే?
శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయిన తమన్న.. ఫ్రెండ్‌తోనే అన్నీ కానిచ్చేస్తుంది..