ప్రభాస్‌కు కోపం తెప్పించే ఏకైక వ్యక్తి అతడే..! అసలు విషయం బయట పెట్టిన స్టార్ డైరెక్టర్

by sudharani |   ( Updated:2024-04-19 15:02:18.0  )
ప్రభాస్‌కు కోపం తెప్పించే ఏకైక వ్యక్తి అతడే..! అసలు విషయం బయట పెట్టిన స్టార్ డైరెక్టర్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్‌గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘సలార్’ మూవీతో భారీ హిట్ అందుకున్న ఈయన.. ప్రజంట్ ‘కల్కి 2898, స్పిరిట్, రాజా సాబ్’ వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ప్రభాస్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రజంట్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రభాస్ చాలా మంచివాడని, తనకు అసలు కోపమే రాదని చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అలాంటి ప్రభాస్‌కే కోపం తెప్పించే ఓ వ్యక్తి ఉన్నాడట. అతను ఎవరు అనే విషాయాల్లోకి వెళితే..

ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో మొదటిసారి వచ్చిన ‘చత్రపతి’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఆ తర్వాత నుంచి వీరిద్దరి కాంబోకి స్పెషల్ ఫ్యాన్స్ బేస్ కూడా ఏర్పడింది. ఈ క్రమంలోనే ‘చత్రపతి’ సినిమా టైంలో ప్రభాస్, రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ముచ్చటించారు. అప్పుడు రాజమౌళి ప్రభాస్ గురించి చెప్తూ.. ‘ప్రభాస్‏కు ఎక్కువగా కోపం తెప్పించే వ్యక్తి కెమెరామెన్ సెంథిల్ మాత్రమే. ఎందుకంటే ఆయన నాకంటే కూడా బాగా పర్ఫెక్షనిస్ట్. ఆర్టిస్ట్ రెడీ అయ్యే టైంలో కూడా చెక్ చేసుకుంటాడు. ఆ విషయమే ప్రభాస్‌కు ఎక్కువ కోపం తెప్పిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Read More...

గుడ్ న్యూస్.. సలార్‌లో ప్రభాస్ వాడిన బైక్‌ ఫ్రీగా పొందే ఛాన్స్!

Advertisement

Next Story

Most Viewed