Guppedantha Manasu: అనుపమకి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర

by Prasanna |   ( Updated:2024-03-23 08:40:01.0  )
Guppedantha Manasu: అనుపమకి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర
X

దిశ, సినిమా: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

అదేంటి? అలా ఎలా వెళ్ళిపోతాడు? మేము వచ్చే వరకు ఉండాలి కదా.. నాతో చెప్పకుండా వెళ్లిపోవడం ఏంటి? అని మహేంద్ర అంటాడు. ‘మీతో చెప్పే వెళ్లమన్నానూ.. కానీ వెళ్ళిపోయాడు’ అని అనుపమ అంటుంది. ‘అదేంటి అనూ.. తను వెళ్తానంటే.. నువ్వూ ఆపాలి కదా.. ఇన్ని రోజులు మను ఎవరో తెలియలేదు.. అలాగే పట్టించుకోలేదు.. కానీ మను నీ కొడుకు అని తెలిసింది. తనేం పరాయి వాడు కాదు కదా.. మా కళ్ల ముందే నువ్వు నీ ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తుంటే మేం చూస్తూ ఊరుకోలేకోతున్నాం. నువ్వు ఎందుకు అంతలా మనుని బాధపెడుతున్నావ్.. అని అంటాడు మహేంద్ర.

అత్తయ్య కూడా బాధపడుతుందని అని ఏంజెల్ అంటుంది. నేను కూడా అదే అంటున్నా.. ఇలా మనుని బాధపెడుతూ.. తను ఎందుకు బాధ పడటం? తల్లికి దూరమైన కొడుకు బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.. ఆ బాధను రిషి రూపంలో కళ్లారా చూశాను. జగతి కూడా రిషికి దూరంగా ఉంటూ ఎంత నరకం అనుభవించిందో నాకు తెలుసు.. లోలోపల కొడుకు కోసం చాలా కుమిలిపోయింది. అసలు .. మీ మధ్య ఏం జరిగింది? కుటుంబం అన్న తరువాత చిన్న గొడవలు ఉంటాయి. కానీ.. కన్న కొడుకుని దూరం పెట్టడం కరెక్ట్ కాదని మహేంద్ర అంటాడు.

Advertisement

Next Story

Most Viewed