Guppedantha Manasu: నీ కొడుకు పెద్ద దద్దమ్మ అంటూ.. శైలేంద్రని తిట్టిన ఫణీంద్ర

by Prasanna |   ( Updated:2024-01-24 07:20:13.0  )
Guppedantha Manasu: నీ కొడుకు పెద్ద దద్దమ్మ అంటూ.. శైలేంద్రని తిట్టిన ఫణీంద్ర
X

దిశ,సినిమా: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

నీ కొడుక్కి చిన్న చిన్న సమస్యలను ఫేస్ చేయడమే చేతకాదు.. వీడిని నమ్మి బాధ్యతలు ఇస్తే.. ఇక అంతే సంగతి. మొన్నటికి మొన్న రిషి సార్ చనిపోయాడనే వార్త కాలేజ్‌లో స్టూడెంట్‌కి తెలిసింది.. వాళ్లు రిషి సార్‌ని చూపించండంటూ పెద్ద గొడవ చేశారు. అప్పుడు ఏం చేయాలో తెలియక.. నీ కొడుకు కాలేజ్ మూసేద్దాం అని సలహా ఇచ్చాడు. అదే వసుధార..అయితే ఒక్క క్షణంలో ఆ సమస్యని పరిష్కరించింది. వసుధారని కాదని నీ కొడుక్కి బాధ్యతలు ఇస్తే మొత్తం నాశనం చేస్తాడు. నువ్వు కూడా మీ అమ్మ లాగే ఫీల్ అవుతున్నావా? అని ఫణీంద్ర అడుగుతాడు

‘అయ్యో అదేం లేదు డాడ్.. మీరు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్’ డాడ్ అని శైలేంద్ర అంటాడు. ఇప్పుడు నీకు బాగా అర్ధమైందా దేవయాని.. వాడి మనసులో ఎలాంటి ఆలోచనలు లేవు.. నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావ్.. ఇంకా నీ మనసులో వెధవ ఆలోచనలు ఉంటే పక్కనపెట్టు’ అని దేవయాని అని గట్టి వార్నింగ్ ఇస్తాడు. బోర్డ్ మెంబర్స్.. స్టూడెంట్స్.. లెక్చరర్స్ ఒకసారి వసుధార ఎండీ పదవికి అర్హురాలని అంటారు.. తిరిగే వాళ్లే అనర్హురాలని అంటాడు.. వాళ్లు ఎందుకు అలా మారిపోతున్నారో నాకు తెలియడం లేదు శైలేంద్రా? అని అంటాడు ఫణీంద్ర.

వసుధారకి మంచి పేరు రావాలంటే.. మనం చేయబోయే ఫెస్ట్ సక్సెస్ కావాలి. తన పై ఉన్న అపోహలు తొలగిపోవాలి.. వసుధార నీ సహాయం కోరితే ఏమి ఆలోచించకుండా.. ఆమెకు సాయం చెయ్.. నాకు తెలిసీ వసుధార నీకు ఎలాంటి పనులు చెప్పదనే అనుకుంటున్నా..ఒక వేళ చెప్తే మాత్రం హెల్ప్ చేయి.. మిగిలిన విషయాలు రేపు మాట్లాడదాం’ అని చెప్పి వెళ్లి పోతాడు ఫణీంద్ర.

Advertisement

Next Story