Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OG సెట్‌లో అడుగుపెట్టనున్న పవన్ కల్యాణ్

by sudharani |
Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OG సెట్‌లో అడుగుపెట్టనున్న పవన్ కల్యాణ్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఈయన ఘన విజయం సాదించడంతో పాటు.. ప్రజెంట్ క్యాబినెట్‌లో మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తాడో లేదో అనే డైలమాలో పడ్డారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అంతే కాకుండా ఎలక్షన్లకు ముందు ఒప్పుకున్న రెండు, మూడు చిత్రాలు పెండింగ్‌లో ఉండటంతో అవైనా కంప్లీట్ చేస్తారో లేదో అని అయోమయం కూడా నెలకొంది. ఇలాంటి సమయంలో ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ అందిందనే చెప్పుకోవచ్చు.

పవన్ కల్యాణ్ పెండింగ్ సినిమాల్లో ‘OG’ ఒకటి. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి DVV దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఇటీవల కలిసారట దానయ్య. ఓజీ మూవీని కచ్చితంగా పూర్తి చేస్తానని నిర్మాత దానయ్యకు హామి ఇచ్చారట పవన్ కల్యాణ్. దీంతో పవన్ కీలక సన్నివేశాలను పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట నిర్మాత దానయ్య, డైరెక్టర్ సుజిత్. కాగా.. ఇప్పటి వరకు 70% షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తుండగా.. ఇంకా పవన్ కల్యాణ్‌కు సంబంధించి పది లేదా పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు ఇంతకుముందు నిర్మాత పలు ఇంటర్వ్యూలో చెప్పకొచ్చాడు. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగా చేసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed