‘మెకానిక్ రాకీ’ నుంచి గ్లింప్స్.. మాస్ యాక్షన్‌లో విశ్వక్ సేన్

by sudharani |
‘మెకానిక్ రాకీ’ నుంచి గ్లింప్స్.. మాస్ యాక్షన్‌లో విశ్వక్ సేన్
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. మాస్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తున్నాడు. ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీస్ మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లురి నిర్మిస్తున్న ‘మెకానిక్ రాకీ’ దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా.. సినిమాలోని కీలక పాత్రలను రివిల్ చేస్తూ.. గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

“ఛోటే ఛోటే బచ్చో కో పూరోన్‌కి మై జవాబ్ దేథూ” అనే హిందీ డైలాగ్‌తో స్టార్ట్ అయిన గ్లింప్స్.. ఎట్రాక్టివ్ ఎంటర్ టైన్మెంట్, డైనమిక్ యాక్షన్ సన్నివేశాలతో అదిరిపోయింది. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే “డేంజర్‌కే లైసెన్సు వీడు” అనే డైలాగ్ కూడా పవర్ ఫుల్‌గా ఆకట్టుకుంటోంది. మీనాక్షి చౌదరి ఎత్నిక్ వేర్‌లో కూల్‌గా కనిపించింది. శ్రద్ధా శ్రీనాథ్ అర్బన్ లేడీ క్యారెక్టర్‌లో మెస్మరైజ్ చేసింది. కాగా.. ఇందులో సునీల్, నరేష్, రోడీస్ రఘు రామ్ కీలక పాత్రల్లో కనిపించి అలరించారు.


Advertisement

Next Story

Most Viewed