వేరే కుర్రాడిని పెళ్లి చేసుకుని కమెడియన్ నూకరాజుకు బిగ్ షాక్ ఇచ్చిన ప్రియురాలు.. వీడియో వైరల్

by Hamsa |
వేరే కుర్రాడిని పెళ్లి చేసుకుని కమెడియన్ నూకరాజుకు బిగ్ షాక్ ఇచ్చిన ప్రియురాలు.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారికంటే బుల్లితెర నటీనటులే ఫుల్ ఫేమస్ అవుతున్నారు. అయితే జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్స్‌లో నూకరాజు కూడా ఒకరు. ఆయన ప్రస్తుతం టీమ్ లీడ్‌గా వ్యవహరిస్తూనే పలు సినిమాల్లోనూ కమెడియన్‌గా చేస్తున్నాడు. అయితే జబర్దస్త్ షో నుండి నూకరాజు ఆసియా అనే అమ్మాయితో రిలేషన్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు యూట్యూబ్ చానల్ పెట్టి వ్లాగ్స్ చేస్తున్నారు. అలాగే బుల్లితెరపై పలు షోలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. కానీ పెళ్లి మాత్రం తమ పెద్దలకు ఇష్టం లేకపోవడంతో చేసుకోవట్లేదని ఓ షోలో భాగంగా వెల్లడించారు. అయినప్పటికీ విడిపోకుండా పెద్దవారి అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఆసియా నూకరాజుకు షాకిచ్చింది. వేరే అబ్బాయిని పెళ్లి చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ అది నిజం పెళ్లి కాదు ఏదో వీడియో కోసం స్క్రిప్ట్‌లో భాగంగా పెళ్లి దుస్తులు ధరించి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఏముందంటే.. పడవలో వెళ్తుండగా.. ఓ నటుడు నూకరాజు అన్నా ఆసియా అక్క వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది వచ్చి ఆశీర్వదించు అన్నా అని అంటాడు. దీంతో ఆ మాటలు విన్న నూకరాజు షాక్ అవుతూ చూస్తాడు. ఇక ఈ వీడియో చూసిన వారు సూపర్ అంటూ స్మైల్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.



Next Story