'ఖుదీరామ్ బోస్'.. టైటిల్ రిలీజ్ చేసిన వెంకయ్య నాయుడు

by srinivas |
ఖుదీరామ్ బోస్.. టైటిల్ రిలీజ్ చేసిన వెంకయ్య నాయుడు
X

దిశ, సినిమా: భారత స్వాతంత్ర్య సమరవీరుల్లో మొదటితరానికి చెందిన అతిపిన్నవయస్కుడు 'ఖుదీరామ్ బోస్' బయోపిక్ తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు విద్యాసాగర్ రాజు. ఇప్పటికే 'ఖుదీరామ్ బోస్' టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్.. భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా టైటిల్ వీడియో విడుదల చేయించారు. ఇక పాన్ ఇండియా లెవల్లో రాబోతున్న మూవీలో రాకేష్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 'చరిత్రలో నిలిచిపోయిన పోరాటంలో దాగిన విలువైన రత్నం ఖుదీరామ్ బోస్' అని తెలిపిన చిత్ర బృందం.. ఆయన జీవితం ఎంతతోమందికి స్ఫూర్తిగా నిలిచిందని ప్రశంసలు కురిపించారు. జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జాగర్లమూడి విజయ్ నిర్మిస్తున్న చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed