- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబుల్ ఇస్మార్ట్ సాంగ్‌లో మాజీ సీఎం కేసీఆర్ ఫేమస్ మీమ్ డైలాగ్!
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ నటుడు రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి రెండో పాట ఇవాళ రిలీజ్ అయింది. ఈ పాట విడుదల అయిన కొద్ది సేపటికే వైరల్ అవుతోంది. ఎందుకంటే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వాయిస్ ‘ఏం చేద్దాం అంటవ్ మరి’ అనే డైలాగ్ ఈ పాటలో పెట్టారు. గతంలో కేసీఆర్ ఓ ప్రెస్‍మీట్‍లో అన్న ఈ మాట ఆ తర్వాత సామాజిక మాధ్యమాల్లో పాపులర్ అయిన విషయం తెలిసిందే. దీన్ని ఫేమస్ మీమ్‌గా నెటిజన్లు వాడుతుంటారు.
‘మార్ ముంత’ అనే ఈ సాంగ్ మధ్యలో ఈ డైలాగ్ పెట్టడంతో సాంగ్‌లో జోష్ మరింత పెరిగిందని రామ్ అభిమానులు చెబుతున్నారు. కాగా, యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‍లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ చిత్రం. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‍గా ఈ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఆధ్వర్యంలో రాహుల్ సిప్లిగంజ్, కీర్తన శర్మ ఈ పాటను ఫుల్ జోష్‍తో పాడారు.