చాలా రోజుల తర్వాత తెలుగు మాట్లాడినందుకు హాయిగా ఉంది: Rajamouli

by Hamsa |   ( Updated:2022-11-29 06:43:31.0  )
చాలా రోజుల తర్వాత తెలుగు మాట్లాడినందుకు హాయిగా ఉంది:  Rajamouli
X

దిశ, సినిమా: అడివి శేష్ హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హిట్ 2'. నేచురల్ స్టార్ నాని స‌మ‌ర్పణ‌లో ప్రశాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 2న మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా శైలేష్ మాట్లాడుతూ.. ' హిట్ ఫ్రాంఛైజీ లో 3,4,5.. ఇలా 7 భాగాలు వస్తాయి. చివరి పార్ట్‌లో అందరి హీరోలను కలుపుతాను. ఓ పెద్ద సమస్య ఇన్వెస్టిగేషన్ కోసం వాళ్లను తీసుకొస్తాను'' అని అన్నారు. నాని మాట్లాడుతూ.. 'నిర్మాతగా కంటే ప్రేక్షకునిగా ఆ మూవీ చూసేందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన రాజమౌళి గారికి థాంక్స్ ఆయనను చూస్తుంటే దర్శకుడిగా కంటే హీరోలా ఉన్నారు. రెండు నెలల తర్వాత ఇక్కడకు వచ్చిన ఆయన నా మాట మేరకు ఈ వేడుకకు హాజరు కావడం నిజంగా ఆనందంగా ఉంది'' అని నాని తెలిపారు. రాజమౌళి మాట్లాడుతూ.. ' గత రెండు నెలలుగా ఇంగ్లీష్ మాట్లాడి ఇప్పుడు తెలుగులో మాట్లాడుతుంటే హాయిగా ఉంది. 'హిట్' అనే అద్భుతమైన ఫ్రాంఛైజీని సృష్టించిన నాని, ప్రశాంతి, శైలేష్‌ను అభినందిస్తున్నాను. థ్రిల్లర్ జోనర్‌లో శైలేష్ బాగా తీశాడు. ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. హిట్ నుంచి 3, 4, 5 సినిమాలు వస్తాయి తెలుసు, అయితే ప్రతి ఏడాది ఒక సీజన్‌లో హిట్ ఫ్రాంఛైజీ రావాలి. శైలేష్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను.' అంటూ రాజమౌళి తన ప్రసంగాన్ని ముగించారు.

ఇవి కూడా చదవండి : " Itlu Maredumilli Prajanikam " సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్

Advertisement

Next Story