‘లవ్ బ్రేకప్’ అనే పోస్ట్‌తో ప్రియుడికి షాకిచ్చిన ఫైమా.. ఏకంగా పెళ్లి ఫ్లెక్సీ ఫొటోతో దర్శనమిచ్చిందిగా!

by Anjali |   ( Updated:2023-08-03 11:08:52.0  )
‘లవ్ బ్రేకప్’ అనే పోస్ట్‌తో ప్రియుడికి షాకిచ్చిన ఫైమా.. ఏకంగా పెళ్లి ఫ్లెక్సీ ఫొటోతో దర్శనమిచ్చిందిగా!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘పటాస్’ షోతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది కమెడియన్ ‘ఫైమా’. తర్వాత తన అద్భుతమైన టాలెంట్‌తో ఈ చిన్నది జబర్దస్త్‌లోకి అడుగు పెట్టి.. ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయి, ఏకంగా బిగ్‌బాస్ ఆరో సీజన్‌లో అవకాశం దక్కించుకుంది. కొద్ది రోజుల క్రితం స్టార్ మాలో ప్రసారమైన ‘బీబీ డ్యాన్స్’ షోలో సందడి చేసింది.. ఇందులో సూర్యతో కలిసి జట్టుగా వచ్చిన ఈ భామ.. అదిరిపోయే డ్యాన్స్ చేసింది. వీళ్లిద్దరూ ఏకంగా టైటిల్‌ను గెలిచారు. ఇక పటాస్ ప్రవీణ్-ఫైమా ప్రేమాయణ గురించి తెలిసిందే.

కాగా తాజాగా ఈ లెడీ కమెడియన్ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టి నెటిజన్లకు షాక్ ఇచ్చింది. ‘‘బేబి సినిమా చూసిన తర్వాత ఫైమా- ప్రవీణ్ బ్రేకప్’ అని రాసి ఉంది. దీంతో ఫైమా ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే, వీళ్లిద్దరూ కలిసి ‘బేబి’ చిత్రం స్ఫూఫ్ వీడియో చేశారు. దానికి సంబంధించిన ప్రమోషన్‌లో భాగంగానే ఫైమా ఈ పోస్ట్ చేసినట్లు ఆ తర్వాత అర్థం అయ్యింది. అయితే ఫైమా వేరే వ్యక్తితో మెడలో దండలు వేసుకుని ఉన్న ఓ ఫ్లెక్స్‌ను కూడా వైరల్ చేస్తున్నారు. దీంతో ఈమె వేరే వ్యక్తిని నిజంగానే పెళ్లి చేసుకోబోతుందా? అని కొందరు.. అందులో ఉన్న వ్యక్తి ముఖాన్ని కావాలనే ఫొటోషాప్ ద్వారా ఎడిట్ చేసి పెట్టారని మరికొందరు ఈ పిక్‌ను హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు.



Advertisement

Next Story